హైదరాబాద్: తెలంగాణలో రేషన్ కార్డు లేని అర్హులు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి వేగంగా రేషన్ కార్డులు అందించేలా చర్యలు చేపట్టిందని తెలిపారు.



