Thursday, 9 July 2026
  • Home  
  • స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఘన నివాళి లక్ష్మీనరసాపురంలో విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఘన నివాళి లక్ష్మీనరసాపురంలో విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా  అనపర్తి, జూలై 5: భారతీయ ఆధ్యాత్మిక తేజస్సును ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప యోగి, తత్వవేత్త స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా శనివారం అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వామి వివేకానంద బోధనలు యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడిగా స్వామి వివేకానంద చిరస్మరణీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, లక్ష్మీనరసాపురం గ్రామ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా 

అనపర్తి, జూలై 5: భారతీయ ఆధ్యాత్మిక తేజస్సును ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప యోగి, తత్వవేత్త స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా శనివారం అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వామి వివేకానంద బోధనలు యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడిగా స్వామి వివేకానంద చిరస్మరణీయులని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి నాయకులు, లక్ష్మీనరసాపురం గ్రామ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.