Saturday, 4 July 2026
  • Home  
  • వాసవి అమ్మవారికి సారె సమర్పించిన బొజ్జల బృందమ్మ
- తిరుపతి

వాసవి అమ్మవారికి సారె సమర్పించిన బొజ్జల బృందమ్మ

శ్రీ కాళహస్తి, జులై 03 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక బజారు వీధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ద్వితీయ ద్వాదశ వర్ష మహా కుంభాభిషేకం మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం అధ్యక్షుడు జూలు గంటి మురళీమోహన్ గుప్తా, కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బొజ్జల బృందమ్మ శనివారం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న బృందమ్మ.. ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకుంటూ అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు. అనంతరం బృందమ్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబు జిల్లా పర్యటనలో ఉన్నందున, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి రిషితమ్మ ఈరోజు కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని వివరించారు. వారు త్వరలోనే మరొక రోజు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.