విధులలో ఉద్యోగ విరమణ వరకు డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ అల్లూరు చంద్రశేఖర్ రెడ్డి చూపిన అంకిత భావం నేటి యువ ఉద్యోగులకు ఆదర్శనీయం అని రాష్ట్ర రవాణాశాఖ అదనపు కమిషనర్ యల్.యస్.యమ్ రమాదేవి అభినందించారు. నెల్లూరు జిల్లా చెన్నూరు కి చెందిన సీనియర్ రవాణా శాఖ అధికారి అల్లూరు చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. రవాణా శాఖ నాన్ టెక్నికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో
రవాణా శాఖ లో మూడు దశాబ్దాల క్రితం ఎ.యమ్.వి
ఐ గా చేరి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా విజయవంతంగా విరమణ చేయడం విశేషమే అని ఆమె చంద్రశేఖర్ రెడ్డి అభినందన సభలో పేర్కొన్నారు. విరమణకు దగ్గరైన వారు కొందరు చివరి రోజులలో విధులపై ఆసక్తి చూపరని కానీ ఇందుకు భిన్నంగా చంద్రశేఖర్ రెడ్డి ఉన్న శెలవులు కూడా వినియోగించుకోకుండా నిజాయితీగా.సేవలు అందించారని రమాశ్రీ కొనియాడారు. సభలో , శివరామ ప్రసాద్, డి.టి.సి ( అడ్మిన్) మీరా ప్రసాద్ రవాణా శాఖ ఉన్నతాధికారులు పూరేంద్ర, క్రిష్ణా రావు, ప్రవీణ్, విశ్రాంత అధికారులు వెంకటేశ్వరరావు, ఆదినారాయణ , న్యాయ మూర్తి పద్మారెడ్డి, మాజీ మున్సిపల్ కమిషనర్ శివనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి బాల్య మిత్రులు సత్యనారాయణ,ప్రభు ప్రసాద్, ప్రాస మణి ,జర్నలిస్టు జయప్రతాప్ రెడ్డి తదితరులు చంద్రశేఖర్ రెడ్డి ఔన్నత్యాన్ని వివరించారు. వృత్తికి న్యాయం చేస్తూ కుటుంబ సంక్షేమం కు పాటుపడుతూ వృద్ధాప్యంలో ఉన్న తల్లితండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవడం విశేషం అని ప్రశంసించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ తన ఎదుగుదల లో తల్లిదండ్రులు, జీవిత సాఫల్యంలో శ్రీమతి ఉజ్వల ఇచ్చిన ప్రోత్సాహం, భగవంతుని ఆశీస్సులే కీలకమని తెలిపారు. వృత్తి లో సహచరులు, ఉన్నతాధికారులు ఇచ్చిన అండదండలతోనే ఎలాంటి మచ్చ లేకుండా విజయవంతంగా విరమణ చేయగలిగానని ధన్యవాదాలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రవాణా శాఖ సిబ్బంది, బంధు మిత్రులు చంద్రశేఖర్ రెడ్డి ని ఘనంగా సత్కరించగా, జన్మనిచ్చిన తల్లిదండ్రుల సమక్షంలో రిటైర్మెంట్ వేడుక అనేది మునుపెన్నడూ లేదని పలువురు హర్షం వ్యక్తంచేశారు.అరగంటలో ముగించాలని భావించిన కార్యక్రమం ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో దాదాపు రెండున్నర గంటల సేపు ఆత్మీయుల భావోద్వేగాల మధ్య వేడుక గా జరిగింది. అనంతరం రవాణా శాఖ జోన్ 3 సిబ్బంది నిర్వహించిన వేడుకలో ఉన్నతాధికారులు మోహన్, మీరాప్రసాద్,టి.సి.చందర్ సీతారామిరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
చంద్రశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి.. రవాణా శాఖ అదనపు కమిషనర్ రమాశ్రీ
విధులలో ఉద్యోగ విరమణ వరకు డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ అల్లూరు చంద్రశేఖర్ రెడ్డి చూపిన అంకిత భావం నేటి యువ ఉద్యోగులకు ఆదర్శనీయం అని రాష్ట్ర రవాణాశాఖ అదనపు కమిషనర్ యల్.యస్.యమ్ రమాదేవి అభినందించారు. నెల్లూరు జిల్లా చెన్నూరు కి చెందిన సీనియర్ రవాణా శాఖ అధికారి అల్లూరు చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. రవాణా శాఖ నాన్ టెక్నికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రవాణా శాఖ లో మూడు దశాబ్దాల క్రితం ఎ.యమ్.వి ఐ గా చేరి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా విజయవంతంగా విరమణ చేయడం విశేషమే అని ఆమె చంద్రశేఖర్ రెడ్డి అభినందన సభలో పేర్కొన్నారు. విరమణకు దగ్గరైన వారు కొందరు చివరి రోజులలో విధులపై ఆసక్తి చూపరని కానీ ఇందుకు భిన్నంగా చంద్రశేఖర్ రెడ్డి ఉన్న శెలవులు కూడా వినియోగించుకోకుండా నిజాయితీగా.సేవలు అందించారని రమాశ్రీ కొనియాడారు. సభలో , శివరామ ప్రసాద్, డి.టి.సి ( అడ్మిన్) మీరా ప్రసాద్ రవాణా శాఖ ఉన్నతాధికారులు పూరేంద్ర, క్రిష్ణా రావు, ప్రవీణ్, విశ్రాంత అధికారులు వెంకటేశ్వరరావు, ఆదినారాయణ , న్యాయ మూర్తి పద్మారెడ్డి, మాజీ మున్సిపల్ కమిషనర్ శివనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి బాల్య మిత్రులు సత్యనారాయణ,ప్రభు ప్రసాద్, ప్రాస మణి ,జర్నలిస్టు జయప్రతాప్ రెడ్డి తదితరులు చంద్రశేఖర్ రెడ్డి ఔన్నత్యాన్ని వివరించారు. వృత్తికి న్యాయం చేస్తూ కుటుంబ సంక్షేమం కు పాటుపడుతూ వృద్ధాప్యంలో ఉన్న తల్లితండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవడం విశేషం అని ప్రశంసించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ తన ఎదుగుదల లో తల్లిదండ్రులు, జీవిత సాఫల్యంలో శ్రీమతి ఉజ్వల ఇచ్చిన ప్రోత్సాహం, భగవంతుని ఆశీస్సులే కీలకమని తెలిపారు. వృత్తి లో సహచరులు, ఉన్నతాధికారులు ఇచ్చిన అండదండలతోనే ఎలాంటి మచ్చ లేకుండా విజయవంతంగా విరమణ చేయగలిగానని ధన్యవాదాలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రవాణా శాఖ సిబ్బంది, బంధు మిత్రులు చంద్రశేఖర్ రెడ్డి ని ఘనంగా సత్కరించగా, జన్మనిచ్చిన తల్లిదండ్రుల సమక్షంలో రిటైర్మెంట్ వేడుక అనేది మునుపెన్నడూ లేదని పలువురు హర్షం వ్యక్తంచేశారు.అరగంటలో ముగించాలని భావించిన కార్యక్రమం ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో దాదాపు రెండున్నర గంటల సేపు ఆత్మీయుల భావోద్వేగాల మధ్య వేడుక గా జరిగింది. అనంతరం రవాణా శాఖ జోన్ 3 సిబ్బంది నిర్వహించిన వేడుకలో ఉన్నతాధికారులు మోహన్, మీరాప్రసాద్,టి.సి.చందర్ సీతారామిరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

