కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి KKC శ్రేణులు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో KKC జిల్లా అధ్యక్షులు సిహెచ్. విప్లవ కుమార్ పటేల్ అధ్యక్షతన జిల్లా సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. మోహన్ నాయక్, ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష మల్లేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేయాలని, అసంఘటిత కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లాలో కాంగ్రెస్తో పాటు KKCను గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయాలని కోరారు. ఆటో డ్రైవర్లు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్, గృహ కార్మికులు, చిరు వ్యాపారులు, గిగ్ వర్కర్లు, రోజువారీ కూలీలను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో KKC ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, పార్లమెంట్ అధ్యక్షులు మెరుగు వెంకట నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి గయాజ్ పాషా, జిల్లా ఉపాధ్యక్షులు డిమార్ట్ జానీ, KKC త్రీ టౌన్ అధ్యక్షులు రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.



