దుత్తలూరు,
జూన్ 29: ( ఉస్మాన్ పున్నమి ప్రతినిధి )
దుత్తలూరు ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన ప్రతిభావంతురాలు చెరుకూరి కరీనా రాష్ట్ర స్థాయి ‘షైనింగ్ స్టార్’ అవార్డును అందుకొని మండలానికి గర్వకారణంగా నిలిచింది. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైన కరీనాకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మంగళగిరిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు.
కరీనా సాధించిన ఈ ఘనత దుత్తలూరు ఏపీ మోడల్ స్కూల్‌తో పాటు మొత్తం నెల్లూరు జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించి, విద్యలో ఉత్తమ ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా కరీనాను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.


