శ్రీ కాళహస్తి, జూన్ 28, (పున్నమి న్యూస్) : అమరావతి అభివృద్ధిని అడ్డుకుని, మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర రాజధానిని నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అమరావతిలో అడుగుపెడుతున్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జూలై 1న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో కార్యక్రమ విజయవంతానికి సంబంధించిన ఏర్పాట్లపై నాయకులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమరావతి అభివృద్ధిని పూర్తిగా నిలిపివేసి, రాజధాని ప్రాంత ప్రజలు, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి తిరిగి అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తుండటాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు అనవసర వివాదాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. అమరావతి రైతుల పోరాటాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు ప్రజలు ఎప్పటికీ సహించరని, రైతుల త్యాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించే కుట్రలు ఫలించవని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టించే రాజకీయాలకు ప్రజలు ఇప్పటికే తగిన సమాధానం ఇచ్చారని, వైసీపీ నాయకులు ఇకనైనా ప్రజా తీర్పును గౌరవించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు డా. జి. దశరథాచారి, ఎం. సుబ్బయ్య, కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్ రావు, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గాదిపాకుల గోపీనాథ్, క్లస్టర్ ఇన్ఛార్జి పేట బాలాజీ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు ఢిల్లీ బాబు, కుమార్, ఎం.ఎస్. రెడ్డి, రామ్మూర్తి, బాబు నాయుడు, రాకేష్, యస్దాని, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

అమరావతిపై వైసీపీకి మాట్లాడే హక్కు లేదు-శ్రీకాళహస్తి టీడీపీ నేతలు