Sunday, 28 June 2026
  • Home  
  • విత్తనోత్పత్తితో రైతులకు అధిక లాభం.. ఏటికొప్పాకలో ఏపీ సీడ్స్ అవగాహన సదస్సు”….!
- అనకాపల్లి

విత్తనోత్పత్తితో రైతులకు అధిక లాభం.. ఏటికొప్పాకలో ఏపీ సీడ్స్ అవగాహన సదస్సు”….!

యలమంచిలి జూన్ 27| పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్: ఏటికొప్పాక గ్రామంలో రైతులకు విత్తనోత్పత్తిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీడ్స్ DM నాగసాయి రైతులకు విత్తనోత్పత్తి విధానం, నాణ్యత ప్రమాణాలు, మార్కెట్ అవకాశాలపై వివరించారు. ఆసక్తి గల రైతులకు Foundation Seeds పంపిణీ చేసి, పంట సాగు నుంచి కోత వరకు ఏపీ సీడ్స్ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శనలు, తనిఖీలు నిర్వహిస్తూ సాంకేతిక సూచనలు అందిస్తారని తెలిపారు. విత్తన ప్రమాణాలు పాటించి పండించిన పంటను ఏపీ సీడ్స్ సంస్థే రైతుల నుంచి మంచి ధరకు కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం కిసాన్ మోర్చా అధ్యక్షుడు శన్నంశెట్టి శ్రీను, గ్రామ అభ్యుదయ రైతులు, ఏపీ సీడ్స్ లీలా మోహన్, వ్యవసాయ శాఖ కుమార్, కర్రీ సింహాచలం, ఎర్రంశెట్టి శీను, నాగిరెడ్డి వెంకటరమణ, మంతెన నెహ్రూ, రాయి అప్పలనాయుడు, కోరి బిల్లు బాబురావు, రావి అరుణ ది మాస్టర్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. రైతులు విత్తనోత్పత్తిపై ఆసక్తి చూపించి కార్యక్రమానికి విశేష స్పందన తెలపగా, ఈ విధానం ద్వారా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తితో పాటు అధిక ఆదాయం పొందే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు పేర్కొన్నారు.

యలమంచిలి జూన్ 27| పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్:

ఏటికొప్పాక గ్రామంలో రైతులకు విత్తనోత్పత్తిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీడ్స్ DM నాగసాయి రైతులకు విత్తనోత్పత్తి విధానం, నాణ్యత ప్రమాణాలు, మార్కెట్ అవకాశాలపై వివరించారు.
ఆసక్తి గల రైతులకు Foundation Seeds పంపిణీ చేసి, పంట సాగు నుంచి కోత వరకు ఏపీ సీడ్స్ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శనలు, తనిఖీలు నిర్వహిస్తూ సాంకేతిక సూచనలు అందిస్తారని తెలిపారు. విత్తన ప్రమాణాలు పాటించి పండించిన పంటను ఏపీ సీడ్స్ సంస్థే రైతుల నుంచి మంచి ధరకు కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం కిసాన్ మోర్చా అధ్యక్షుడు శన్నంశెట్టి శ్రీను, గ్రామ అభ్యుదయ రైతులు, ఏపీ సీడ్స్ లీలా మోహన్, వ్యవసాయ శాఖ కుమార్, కర్రీ సింహాచలం, ఎర్రంశెట్టి శీను, నాగిరెడ్డి వెంకటరమణ, మంతెన నెహ్రూ, రాయి అప్పలనాయుడు, కోరి బిల్లు బాబురావు, రావి అరుణ ది మాస్టర్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
రైతులు విత్తనోత్పత్తిపై ఆసక్తి చూపించి కార్యక్రమానికి విశేష స్పందన తెలపగా, ఈ విధానం ద్వారా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తితో పాటు అధిక ఆదాయం పొందే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.