ప్రతీ ఒక్కరు మానవత్వంతో స్పందించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని
ఎం.వి.పి.కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ కే.ఎన్.ఎస్.వి.ప్రసాద్ పిలుపునిచ్చారు.
పెద వాల్తేర్ రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల వసతి గృహంలో సోషల్ వర్కర్, చారిటీ బాక్స్ సభ్యురాలు మదీనా బీబీ (మున్నీ) పుట్టినరోజు సందర్భంగా
అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సిఐ కే.ఎన్.ఎస్.వి.ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని సోషల్ వర్కర్ మదీనా బీబీని సత్కరించి, చారిటీ బాక్స్ ద్వారా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.
సోషల్ వర్కర్
మహ్మద్ ఖాజా అబ్దుల్లా (ఆర్.పి.ఎఫ్),
నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ మురళి
ఆధ్వర్యంలో మదీనా బీబీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడమే కాకుండా, అక్కడ నిరాశ్రయులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారని కొనియాడారు.
ప్రతీ ఒక్కరూ సామాజిక కోణంలో ఆలోచించి తమ పుట్టినరోజు, పెళ్లి వేడుకలను ఇటువంటి నిరాశ్రయుల వసతి గృహంలో నిర్వహించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ ,చారిటీ బాక్స్ సభ్యులు మదీనా బీబీ(మున్నీ), సోషల్ వర్కర్ మహ్మద్ ఖాజా అబ్దుల్లా (ఆర్.పి.ఎఫ్),
రెడ్ క్రాస్ సొసైటీ
నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ మురళి, సీనియర్ పాత్రికేయులు రామకృష్ణ మహాపాత్రో, సనరా వంశీ అలాగే సురేఖ, వరలక్ష్మీ దేవి, జైబూన్, అల్తాఫ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు మానవత్వంతో స్పందించి సేవా కార్యక్రమాలు చేపట్టాలి
ప్రతీ ఒక్కరు మానవత్వంతో స్పందించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎం.వి.పి.కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ కే.ఎన్.ఎస్.వి.ప్రసాద్ పిలుపునిచ్చారు. పెద వాల్తేర్ రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల వసతి గృహంలో సోషల్ వర్కర్, చారిటీ బాక్స్ సభ్యురాలు మదీనా బీబీ (మున్నీ) పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ కే.ఎన్.ఎస్.వి.ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని సోషల్ వర్కర్ మదీనా బీబీని సత్కరించి, చారిటీ బాక్స్ ద్వారా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. సోషల్ వర్కర్ మహ్మద్ ఖాజా అబ్దుల్లా (ఆర్.పి.ఎఫ్), నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ మురళి ఆధ్వర్యంలో మదీనా బీబీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడమే కాకుండా, అక్కడ నిరాశ్రయులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ సామాజిక కోణంలో ఆలోచించి తమ పుట్టినరోజు, పెళ్లి వేడుకలను ఇటువంటి నిరాశ్రయుల వసతి గృహంలో నిర్వహించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ ,చారిటీ బాక్స్ సభ్యులు మదీనా బీబీ(మున్నీ), సోషల్ వర్కర్ మహ్మద్ ఖాజా అబ్దుల్లా (ఆర్.పి.ఎఫ్), రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ మురళి, సీనియర్ పాత్రికేయులు రామకృష్ణ మహాపాత్రో, సనరా వంశీ అలాగే సురేఖ, వరలక్ష్మీ దేవి, జైబూన్, అల్తాఫ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

