Wednesday, 24 June 2026
  • Home  
  • అనపర్తిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై BLA-2 లతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమీక్ష
- తూర్పు గోదావరి

అనపర్తిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై BLA-2 లతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమీక్ష

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా  అనపర్తి, జూన్ 23 ( పున్నమి న్యూస్ ): అనపర్తి శాసనసభ్యుల కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టిడిపి, బీజేపీ పార్టీల బీఎల్‌ఏ-2లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఏ-2ల విధులు, బాధ్యతలు, అనుసరించాల్సిన విధివిధానాలపై సమగ్రంగా చర్చించారు. అలాగే అనపర్తి మండలంలోని ప్రతి బూత్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఏ విధంగా అమలవుతోందో అడిగి తెలుసుకుని, క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాష్ట్ర కన్వీనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సిన అవసరాన్ని సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండలానికి చెందిన టిడిపి, బీజేపీ పార్టీల బీఎల్‌ఏ-2లు, అలాగే ఇరు పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా 

అనపర్తి, జూన్ 23 ( పున్నమి న్యూస్ ): అనపర్తి శాసనసభ్యుల కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టిడిపి, బీజేపీ పార్టీల బీఎల్‌ఏ-2లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఎల్‌ఏ-2ల విధులు, బాధ్యతలు, అనుసరించాల్సిన విధివిధానాలపై సమగ్రంగా చర్చించారు. అలాగే అనపర్తి మండలంలోని ప్రతి బూత్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఏ విధంగా అమలవుతోందో అడిగి తెలుసుకుని, క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాష్ట్ర కన్వీనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సిన అవసరాన్ని సమావేశంలో వివరించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి మండలానికి చెందిన టిడిపి, బీజేపీ పార్టీల బీఎల్‌ఏ-2లు, అలాగే ఇరు పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.