ఉదయగిరిలో YSRCP భారీ నిరసన ర్యాలీకి పిలుపు
ఉదయగిరి నియోజకవర్గంలో యువత, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై YSR కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు DSC నియామకాల్లో అవకతవకలపై విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు వైఎస్సార్ సర్కిల్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ ట్యాంక్ బండ్ మీదుగా బస్‌స్టాండ్ సెంటర్ వరకు సాగనుంది. మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఉదయగిరిలో YSRCP భారీ నిరసన ర్యాలీకి పిలుపు
ఉదయగిరిలో YSRCP భారీ నిరసన ర్యాలీకి పిలుపు ఉదయగిరి నియోజకవర్గంలో యువత, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై YSR కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు DSC నియామకాల్లో అవకతవకలపై విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు వైఎస్సార్ సర్కిల్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ ట్యాంక్ బండ్ మీదుగా బస్‌స్టాండ్ సెంటర్ వరకు సాగనుంది. మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

