ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 23 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు రైతు సేవా కేంద్రంలో మంగళవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడి శివ నాయక్ మాట్లాడుతూ అధికంగా రసాయన ఎరువులు వాడటం వల్ల నేల సారం తగ్గి భూమి నిస్సారంగా మారుతుందని తెలిపారు. తెగుళ్ల సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, యూరియాను కూడా పంట అవసరానికి అనుగుణంగా మాత్రమే వాడాలని సూచించారు. అనంతరం రైతులకు పంటల నిర్వహణపై పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో ఏవో వెంకట కృష్ణయ్య, వీఏఏ శివకుమార్, నాయకులు పచ్చిపాల రామురెడ్డి, రాయపాటి కిరణ్, రైతులు పాల్గొన్నారు.

రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి: ఏడి శివ నాయక్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 23 (పున్నమి ప్రతినిధి) మనుబోలు రైతు సేవా కేంద్రంలో మంగళవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడి శివ నాయక్ మాట్లాడుతూ అధికంగా రసాయన ఎరువులు వాడటం వల్ల నేల సారం తగ్గి భూమి నిస్సారంగా మారుతుందని తెలిపారు. తెగుళ్ల సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, యూరియాను కూడా పంట అవసరానికి అనుగుణంగా మాత్రమే వాడాలని సూచించారు. అనంతరం రైతులకు పంటల నిర్వహణపై పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో ఏవో వెంకట కృష్ణయ్య, వీఏఏ శివకుమార్, నాయకులు పచ్చిపాల రామురెడ్డి, రాయపాటి కిరణ్, రైతులు పాల్గొన్నారు.

