భారత ప్రధాన న్యాయమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో నేషనల్ లోక్ అదాలత్ జూలై 11 న నిర్వహించనున్నట్లు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వై జె పద్మశ్రీ తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ 9 మండల న్యాయ సేవాధికార సంఘాలు కోవూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, కోట, ఉదయగిరి నందు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతున్నట్లు తెలిపారు. ఈ నేషనల్ లోక్ అదాలత్ లో కక్షిదారులు వారి యొక్క రాజీ పడదగ్గ అన్ని రకాల కేసులను మోటార్ ఆక్సిడెంట్ కేసులను ( పెండింగ్ మరియు ఫ్రీ లిటిగేషన్) సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మరియు అన్ని రకముల కేసులు విరివిగా రాజీ చేసుకోవాల్సిందిగా కోరారు.
లోక్ అదాలత్ వల్ల ప్రజలకు త్వరితగతిన న్యాయం పొందే అవకాశం కోర్టు ఖర్చులు మరియు విలువైన సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చని. అంతేగాక లోక్ అదాలత్ ఇచ్చే తీర్పుపై అప్పీలు కూడా ఉండదు. అందువల్ల వివాదాలు శాశ్వత పరిష్కారానికి నోచుకుంటాయని శ్రీ నివాస్, పద్మశ్రీ లు తెలిపారు




