రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి, ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ దారుణంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించే వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవగాహన లేదని మండిపడ్డారు. వైయస్. జగన్ పర్యటనకు భయపడే చంద్రబాబు బాధితులను పిలిపించుకుని డ్రామాలు ఆడుతున్నారని, కొడుకును చంపేశారని ఆవేదనతో ప్రశ్నించడాన్ని ఒప్పుకుంటూ ఆ తల్లి కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ సహా తనపై 27 అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారులను కుదించి, కౌలు రైతులను ముంచేసి చంద్రబాబు రైతు వ్యతిరేకిగా మారారని, రాబోయే రోజుల్లో ఈ రాక్షస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని కాకాణి హెచ్చరించారు.
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వాలు మారవచ్చు కానీ, వ్యవస్థలు మాత్రం పక్షపాతం లేకుండా తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని హితవు పలికారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా వైయస్ జగన్ పనిచేస్తే చంద్రబాబు తన నైజానికి తగ్గట్టుగా రైతులకు కోతలు పెట్టి ‘రైతు వ్యతిరేకి’గా ముద్రపడ్డారని. జగన్ హయాంలో 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందితే.. కూటమి ప్రభుత్వం ఆ సంఖ్యను కేవలం 46,85,939 మందికే కుదించిందని. అర్హులైన వారిలో 10 శాతం మందికి ఇప్పటికీ సాయం అందక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని కాకాణి ఆరోపించారు.
రాష్ట్రంలో గ్రావెల్, ఇసుక, మద్యం మాఫియాలు, బెట్టింగులు, పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నడుస్తున్నా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మాజీ గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అరాచకాలు, కక్షసాధింపులు మానేసి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుకు, ఆయనకు భజన చేసే పచ్చ మీడియాకు ఏపీ ప్రజలు కోలుకోలేని ఎదురుదెబ్బ కొట్టడం ఖాయమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన ‘అన్నదాత సుఖీభవ’ లో కోతలు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించి, ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ దారుణంపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించే వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవగాహన లేదని మండిపడ్డారు. వైయస్. జగన్ పర్యటనకు భయపడే చంద్రబాబు బాధితులను పిలిపించుకుని డ్రామాలు ఆడుతున్నారని, కొడుకును చంపేశారని ఆవేదనతో ప్రశ్నించడాన్ని ఒప్పుకుంటూ ఆ తల్లి కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ సహా తనపై 27 అక్రమ కేసులు పెట్టి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారులను కుదించి, కౌలు రైతులను ముంచేసి చంద్రబాబు రైతు వ్యతిరేకిగా మారారని, రాబోయే రోజుల్లో ఈ రాక్షస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని కాకాణి హెచ్చరించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వాలు మారవచ్చు కానీ, వ్యవస్థలు మాత్రం పక్షపాతం లేకుండా తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని హితవు పలికారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైయస్ జగన్ పనిచేస్తే చంద్రబాబు తన నైజానికి తగ్గట్టుగా రైతులకు కోతలు పెట్టి ‘రైతు వ్యతిరేకి’గా ముద్రపడ్డారని. జగన్ హయాంలో 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందితే.. కూటమి ప్రభుత్వం ఆ సంఖ్యను కేవలం 46,85,939 మందికే కుదించిందని. అర్హులైన వారిలో 10 శాతం మందికి ఇప్పటికీ సాయం అందక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారని కాకాణి ఆరోపించారు. రాష్ట్రంలో గ్రావెల్, ఇసుక, మద్యం మాఫియాలు, బెట్టింగులు, పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నడుస్తున్నా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మాజీ గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అరాచకాలు, కక్షసాధింపులు మానేసి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుకు, ఆయనకు భజన చేసే పచ్చ మీడియాకు ఏపీ ప్రజలు కోలుకోలేని ఎదురుదెబ్బ కొట్టడం ఖాయమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

