త్రాగనీటి కోసం వెళ్లి మృత్యువాత పడిన సంఘటన శనివారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం పరిధిలోని వినోబా నగర్ గ్రామంలో చోటుచేసుకుంది దీనికి సంబంధించిన స్థానికులు పోలీసులు వివరాల మేరకు వినోబా నగర్ గ్రామానికి చెందిన సంపత్ (50) అనే కూలి శనివారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లి పని ముగించుకొని ఇంటికి వచ్చి త్రాగునీటి కోసం తన సైకిల్లో నీళ్ల క్యాన్ పెట్టుకుని పిచ్చాటూరు మండలం రామగిరి గ్రామంలో ఉన్న వాల్మీకేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వెళుతున్న సమీపంలో నాగలాపురం మండలం కృష్ణాపురం గ్రామ మలుపు వద్ద వెనక నుండి లారీ సైకిలను ఢీకొనడంతో ఈ ప్రమాదంలో సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే నాగలాపురం పోలీసులకు సమాచారం అందించారు దీనిపై నాగలాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన తీరును పరిశీలించి అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న బంధువులు సంపత్ శవాన్ని చూసి కన్నీటి పర్వతమయ్యారు

త్రాగునీటి కోసం వెళ్లి లారీ ఢీకొని కూలీ మృతి