శ్రీ కాళహస్తి, జూన్ 18, (పున్నమి న్యూస్) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ల సవరణ–2026 (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని 294 పోలింగ్ కేంద్రాల పరిధిలో జూన్ 15 నుంచి బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. తప్పులు లేని, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీ లక్ష్యంగా మరణించిన, వలస వెళ్లిన, ద్వంద్వ నమోదులు కలిగిన ఓటర్ల పేర్ల తొలగింపుతో పాటు, జూలై 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకునే అర్హులైన యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేస్తున్నారు. ఓటర్ల నమోదు అధికారి, ఆర్డీఓ వెల్లడించిన వివరాల ప్రకారం, నియోజకవర్గంలోని మొత్తం 2,49,123 మంది ఓటర్లకు గాను ఇప్పటివరకు 1,27,297 ఎన్యూమరేషన్ ఫారాలు జారీ చేయగా, 401 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. మండలాల వారీగా శ్రీకాళహస్తి రూరల్‌లో 29,411, శ్రీకాళహస్తి అర్బన్‌లో 27,332, రేణిగుంటలో 25,937, ఏర్పేడులో 21,730, తొట్టంబేడు మండలంలో 22,887 ఫారాలు జారీ చేసినట్లు తెలిపారు. నాణ్యమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం అధికారులు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేగంగా ప్రత్యేక ఓటర్ల సవరణ