స్వాతంత్ర్యం లభించి ఇన్ని సంవత్సరాలు అయినా యానాదుల జీవితాలలో తగినంత ప్రగతి లేదని జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ప్రథాన కార్యదర్శి వై.పద్మశ్రీ ఆవేదన వ్యక్తంచేశారు.
హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వై జె పద్మశ్రీ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల గిరిజన కాలనీ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సమాజంలో నిమ్మనజాతులు యానాదులు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వెనుకబడి ఉన్నారని అదేవిధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను వారికి వివరించి ఎక్కడైనా పరిష్కారం గాని సమస్యలను లోకదాలతో ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరిస్తామని తెలిపినారు అదేవిధంగా
బాల్య వివాహాల నిషేధం ఉన్నా బాల్యవివాహాలు జరుగుతూ ఉన్నాయని, ముక్కుపచ్చలారని బాలికలకు బలవంతంగా మరొక బాలుడుతోనో లేదా వయసు మళ్లిన వృద్ధునితో వివాహం బాలల హక్కులను కాలరాయడమేనని అత్యంత హేయమైన ఆచారమని తెలిపారు . ఇటువంటి బాల్య వివాహాలను బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 సంవత్సరంలో నిషేధించి నేరముగా ప్రకటించిందని చెప్పారు. తదుపరి మహిళల అక్రమ రవాణా జరుగుతుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వారి తరలించి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారని అదేవిధంగా బాలికలను తరలించిన వారిని భిక్షాటనకు డ్రగ్స్ కు తరలించడానికి వాడుకుంటున్నారని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తదుపరి కొంతమంది యానాదులు తమకు చాలా మందికి ఆధార్ కార్డ్స్ లేవు అని జడ్జి పద్మశ్రీ కి తెలుపగా అక్కడే ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తో మాట్లాడి సమస్య పరిష్కరించారు. తదుపరి జడ్జి గారు మీకు ఏం అవసరమైనా మన పి ఎల్ వి పెంచల నరసయ్య రమణయ్య మంగమ్మ ఇక్కడే ఉంటారని, అర్జీ రూపంలో తెలియపరిస్తే పై అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపినారు అలాగే తదుపరి పిల్లలందరినీ చదివించాలని . అలాగే బాండెడ్ లేబర్ గురించి వివరించి పిల్లలను పనిలో పెట్టరాదని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీడీవో శైల కుమార్ ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ ఆర్ఐ శివ లోక్ అదాలత్ మెంబర్ శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్ పెంచలయ్య లీగల్ వాలంటరీ మిశ్రా, నరసయ్య, మంగమ్మ రమణయ్య, జై కృష్ణ, ఏపీఎం వెలుగు రోజ్ మేరీ, ఐ సి డి ఎస్ సి డి పి ఓ అరుణ తదితరులు పాల్గొన్నారు.

యానాదుల కు స్వతంత్ర ఫలాలు అందాలి సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ
స్వాతంత్ర్యం లభించి ఇన్ని సంవత్సరాలు అయినా యానాదుల జీవితాలలో తగినంత ప్రగతి లేదని జిల్లా న్యాయ సేవాధికారసంస్థ ప్రథాన కార్యదర్శి వై.పద్మశ్రీ ఆవేదన వ్యక్తంచేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వై జె పద్మశ్రీ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల గిరిజన కాలనీ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సమాజంలో నిమ్మనజాతులు యానాదులు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వెనుకబడి ఉన్నారని అదేవిధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను వారికి వివరించి ఎక్కడైనా పరిష్కారం గాని సమస్యలను లోకదాలతో ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పరిష్కరిస్తామని తెలిపినారు అదేవిధంగా బాల్య వివాహాల నిషేధం ఉన్నా బాల్యవివాహాలు జరుగుతూ ఉన్నాయని, ముక్కుపచ్చలారని బాలికలకు బలవంతంగా మరొక బాలుడుతోనో లేదా వయసు మళ్లిన వృద్ధునితో వివాహం బాలల హక్కులను కాలరాయడమేనని అత్యంత హేయమైన ఆచారమని తెలిపారు . ఇటువంటి బాల్య వివాహాలను బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 సంవత్సరంలో నిషేధించి నేరముగా ప్రకటించిందని చెప్పారు. తదుపరి మహిళల అక్రమ రవాణా జరుగుతుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వారి తరలించి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారని అదేవిధంగా బాలికలను తరలించిన వారిని భిక్షాటనకు డ్రగ్స్ కు తరలించడానికి వాడుకుంటున్నారని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తదుపరి కొంతమంది యానాదులు తమకు చాలా మందికి ఆధార్ కార్డ్స్ లేవు అని జడ్జి పద్మశ్రీ కి తెలుపగా అక్కడే ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తో మాట్లాడి సమస్య పరిష్కరించారు. తదుపరి జడ్జి గారు మీకు ఏం అవసరమైనా మన పి ఎల్ వి పెంచల నరసయ్య రమణయ్య మంగమ్మ ఇక్కడే ఉంటారని, అర్జీ రూపంలో తెలియపరిస్తే పై అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపినారు అలాగే తదుపరి పిల్లలందరినీ చదివించాలని . అలాగే బాండెడ్ లేబర్ గురించి వివరించి పిల్లలను పనిలో పెట్టరాదని తెలిపినారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీడీవో శైల కుమార్ ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ ఆర్ఐ శివ లోక్ అదాలత్ మెంబర్ శ్రీనివాసరావు హెడ్ కానిస్టేబుల్ పెంచలయ్య లీగల్ వాలంటరీ మిశ్రా, నరసయ్య, మంగమ్మ రమణయ్య, జై కృష్ణ, ఏపీఎం వెలుగు రోజ్ మేరీ, ఐ సి డి ఎస్ సి డి పి ఓ అరుణ తదితరులు పాల్గొన్నారు.

