మనుబోలు మండలం అక్కంపేటలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గ్రామ పెద్ద అంబటి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ, తాను కోటి రూపాయలు దుర్వినియోగం చేశానని ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే రూ.50 లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించారు. దేవాలయ నిర్మాణానికి సేకరించిన ప్రతి రూపాయికి లెక్కలు చెప్పేందుకు సిద్ధమన్నారు. తాను రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చి, మూడేళ్లుగా ధూపదీప నైవేద్య ఖర్చులు భరిస్తున్నానని తెలిపారు. మాజీ సర్పంచ్ కిరణ్కుమార్ రెడ్డి గ్రామాభివృద్ధికి విశేష సేవలు చేశారని పలువురు గ్రామస్తులు కొనియాడుతూ, నిరాధార ఆరోపణలు మానుకోవాలని కోరారు.

నిరూపిస్తే రూ.50 లక్షల బహుమతి: అంబటి వెంకటసుబ్బారెడ్డి