ఖమ్మం, ఆగస్టు
(పున్నమి న్యూస్ )
బీహార్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు సుదర్శన్ మిశ్రా స్పందించారు. బీహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గంలో విజయం సాధించిన ప్రశాంత్ కిషోర్‌కు, మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యాం సింగ్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
ఎన్నికల ఫలితాలను బీజేపీ హుందాగా అంగీకరిస్తుందని, ప్రజల తీర్పును ఎల్లప్పుడూ గౌరవిస్తామని పేర్కొన్నారు. ఓటమికి ఈవీఎంలను నిందించడం, ఓటర్లను అవమానించే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.
ప్రతి ఎన్నికలో గెలుపోటములు సహజమేనని, ఎన్నికల ఫలితాలను పరిపక్వతతో స్వీకరించడం అన్ని రాజకీయ పార్టీల బాధ్యత అని సుదర్శన్ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం ఉంచి, ప్రజల తీర్పును గౌరవించే రాజకీయ సంస్కృతి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.



