Sunday, 14 June 2026
  • Home  
  • బాల కార్మిక వ్యవస్థకు దూరంగా.. విద్యతోనే ఉజ్వల భవిష్యత్
- తిరుపతి

బాల కార్మిక వ్యవస్థకు దూరంగా.. విద్యతోనే ఉజ్వల భవిష్యత్

శ్రీకాళహస్తి, జూన్ 13, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని ఎర్రమరెడ్డిపల్లి గ్రామంలో ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలల సంఘం సభ్యులకు బాల కార్మిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు విద్య ప్రాధాన్యత, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంస్థ కో-కన్వీనర్ రామచంద్ర మాట్లాడుతూ.. ప్రతి బాలబాలిక క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ కనీసం 18 సంవత్సరాల వయస్సు వరకు విద్యను కొనసాగించాలని సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి విద్యే బలమైన పునాది అని, బాల కార్మిక వ్యవస్థ లేని సమాజమే నిజమైన అభివృద్ధికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే చదువుకు దూరమై పనుల్లో నిమగ్నమైతే భవిష్యత్తు అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. చార్టులు, చిత్రాల ద్వారా బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యతను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. సదస్సులో పాల్గొన్న పిల్లలు బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే నష్టాలను తెలుసుకుని, చదువుతోనే తమకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. బాలలందరూ విద్యాభ్యాసంపై దృష్టి సారించి తమ లక్ష్యాలను సాధించాలని కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.