Friday, 12 June 2026
  • Home  
  • ఖమ్మం మైనర్ బాలికపై అత్యాచార ఘటన: తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ ఖమ్మం జిల్లా మహిళా మోర్చా నేత శ్రీమతి మందా సరస్వతి డిమాండ్
- ఖమ్మం

ఖమ్మం మైనర్ బాలికపై అత్యాచార ఘటన: తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ ఖమ్మం జిల్లా మహిళా మోర్చా నేత శ్రీమతి మందా సరస్వతి డిమాండ్

ఖమ్మం, జూన్ (పువ్వాడ నాగేంద్ర కూమర్ పున్నమి ఖమ్మం జిల్లా రిపోర్టర్ ) ఖమ్మంలో 12 సంవత్సరాల మైనర్ బాలికపై జరిగిన అమానుష అత్యాచార ఘటనను బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు మందా సరస్వతి తీవ్రంగా ఖండించారు. సమాజం తలదించుకునేలా చేసిన ఈ దారుణ ఘటనకు బాధ్యుడైన నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు గౌష్ పాషాపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి, చట్టం ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితురాలికి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే పూర్తిగా భరించాలని డిమాండ్ చేశారు. తీవ్ర మనోవేదనకు గురైన బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆమె కోరారు. మహిళలు, మైనర్ బాలికల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కూమర్
పున్నమి ఖమ్మం జిల్లా రిపోర్టర్ )

ఖమ్మంలో 12 సంవత్సరాల మైనర్ బాలికపై జరిగిన అమానుష అత్యాచార ఘటనను బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు మందా సరస్వతి తీవ్రంగా ఖండించారు. సమాజం తలదించుకునేలా చేసిన ఈ దారుణ ఘటనకు బాధ్యుడైన నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు గౌష్ పాషాపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి, చట్టం ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితురాలికి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే పూర్తిగా భరించాలని డిమాండ్ చేశారు. తీవ్ర మనోవేదనకు గురైన బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ఆమె కోరారు.

మహిళలు, మైనర్ బాలికల భద్రత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.