వ్యవసాయ శాఖ రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో పండిస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలకు ఆసక్తి పెరుగుతోందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు అధికారి కన్నయ్య పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యం దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల లో ఆదర్శ రైతులను ఎంపిక చేసుకొని ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించే క్రమం లో ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, డివిజన్ కేంద్రాల్లో ని తహశీల్దార్ కార్యాలయ వద్ద ఆదర్శ రైతులచే స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే ప్రజలు ఈ స్టాల్స్ సందర్శించి ఉత్పత్తులు కొనుగోలు చేయడం పెరిగిందని కన్నయ్య తెలిపారు.

జోరుగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు. ప్రాజెక్టు మేనేజర్ కన్నయ్య
వ్యవసాయ శాఖ రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో పండిస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలకు ఆసక్తి పెరుగుతోందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు అధికారి కన్నయ్య పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల లో ఆదర్శ రైతులను ఎంపిక చేసుకొని ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించే క్రమం లో ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, డివిజన్ కేంద్రాల్లో ని తహశీల్దార్ కార్యాలయ వద్ద ఆదర్శ రైతులచే స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే ప్రజలు ఈ స్టాల్స్ సందర్శించి ఉత్పత్తులు కొనుగోలు చేయడం పెరిగిందని కన్నయ్య తెలిపారు.

