Thursday, 4 June 2026
  • Home  
  • ప్రతాప్ రెడ్డి ఇంట అభిమానుల తిరునాళ్లు భారీగా జన్మదిన వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రతాప్ రెడ్డి ఇంట అభిమానుల తిరునాళ్లు భారీగా జన్మదిన వేడుకలు

మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున నిర్వహించిన క్రమం తిరుణాల వాతావరణాన్ని సృష్టించింది ఆయన ఇంటికి సమీపంలో అభిమానులు కట్టిన ఫ్లెక్సీలతో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానుల రాకపోకలతో సందడి నెలకొంది. ప్రతాప్ రెడ్డి వీరాభిమాని వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఈతముక్కల శేఖర్ రెడ్డి పుల్లా శ్రీనివాసులు రెడ్డి,తదితరుల నేతృత్వంలో యువత బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఇంటి వద్ద చేరుకొని బాణ సంచాల పేలుస్తూ 12 గంటల సమయంలో ప్రతాప్ రెడ్డి రాగానే ఆనంతరం కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా సీనియర్ యస్ సి సెల్ నేత పరుసు మాల్యాద్రి నృత్యం యువతలో ఉత్సాహం రేకెత్తించింది. బుధవారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నాయకులు వేమిరెడ్డి విజయ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి ఆనందోత్సాహాలతో పుట్టినరోజు వేడుకలు మొదలుపెట్టారు. గురువారం ఉదయం నుండి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని గ్రామాల నుండి , వార్డుల నుంచి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన వచ్చిన అభిమానులను, కార్యకర్తలను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతమంది అభిమానులు తనకు అండగా ఉండగా తన ఆరోగ్యానికి ఇలాంటి డొక లేదని ఆరోగ్య గురించి ప్రశ్నించిన పలువురితో ప్రతాప్ రెడ్డి ప్రస్తావిస్తూ మీ అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఈతముక్కల చందు, ఆర్.కె.క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో 200 యూనిట్ల రక్త సేకరణ చేశారు. ఈ శిబిరంలో 200 మందికి పైగా పాల్గొని రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. బి.సి.భవన్ నేత ద్రోణాదుల వెంకట్రావు,వాసంతి లు నెల్లూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలమాల, కిరీటం తో అభినందించి పాదాభివందనం చేశారు. నూతనంగా ఆయనను అభినందించేందుకు వచ్చిన వారిలో తెలుగు యువత మాజీ జిల్లా నేత గుళ్లపల్లి మురళి, మత్స్య కార నేత చిన్ని వరప్రసాద్.బి.సి నేత అద్దంకి ప్రభాకర్ లతో పాటు , జలదంకి మండలం నుంచి వైసీపీ ఇతర పార్టీల కార్యకర్తలు ఉండడం గమనార్హం. ఇక పలువురు అధికారులు,ఇతర పార్టీల ప్రముఖులు దూరవాణి సందేశాలను శుభాకాంక్షలతో నింపేసి నట్లు సమాచారం.

మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు భారీ ఎత్తున నిర్వహించిన క్రమం తిరుణాల వాతావరణాన్ని సృష్టించింది ఆయన ఇంటికి సమీపంలో అభిమానులు కట్టిన ఫ్లెక్సీలతో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానుల రాకపోకలతో సందడి నెలకొంది. ప్రతాప్ రెడ్డి వీరాభిమాని వేమిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఈతముక్కల శేఖర్ రెడ్డి పుల్లా శ్రీనివాసులు రెడ్డి,తదితరుల నేతృత్వంలో యువత బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఇంటి వద్ద చేరుకొని బాణ సంచాల పేలుస్తూ 12 గంటల సమయంలో ప్రతాప్ రెడ్డి రాగానే ఆనంతరం కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా సీనియర్ యస్ సి సెల్ నేత పరుసు మాల్యాద్రి నృత్యం యువతలో ఉత్సాహం రేకెత్తించింది.
బుధవారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నాయకులు వేమిరెడ్డి విజయ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి ఆనందోత్సాహాలతో పుట్టినరోజు వేడుకలు మొదలుపెట్టారు. గురువారం ఉదయం నుండి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని గ్రామాల నుండి , వార్డుల నుంచి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన వచ్చిన అభిమానులను, కార్యకర్తలను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతమంది అభిమానులు తనకు అండగా ఉండగా తన ఆరోగ్యానికి ఇలాంటి డొక లేదని ఆరోగ్య గురించి ప్రశ్నించిన పలువురితో ప్రతాప్ రెడ్డి ప్రస్తావిస్తూ
మీ అందరి సహాయ సహకారాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఈతముక్కల చందు, ఆర్.కె.క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు నిర్వహించిన
రక్తదాన శిబిరంలో 200 యూనిట్ల రక్త సేకరణ చేశారు.
ఈ శిబిరంలో 200 మందికి పైగా పాల్గొని రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. బి.సి.భవన్ నేత ద్రోణాదుల వెంకట్రావు,వాసంతి లు నెల్లూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలమాల, కిరీటం తో అభినందించి పాదాభివందనం చేశారు.
నూతనంగా ఆయనను అభినందించేందుకు వచ్చిన వారిలో తెలుగు యువత మాజీ జిల్లా నేత గుళ్లపల్లి మురళి, మత్స్య కార నేత చిన్ని వరప్రసాద్.బి.సి నేత అద్దంకి ప్రభాకర్ లతో పాటు , జలదంకి మండలం నుంచి వైసీపీ ఇతర పార్టీల కార్యకర్తలు ఉండడం గమనార్హం. ఇక పలువురు అధికారులు,ఇతర పార్టీల ప్రముఖులు దూరవాణి సందేశాలను శుభాకాంక్షలతో నింపేసి నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.