శ్రీ కాళహస్తి, జూన్ 04, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనే లక్ష్యంగా స్థానిక జనసేన నాయకులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ అన్నదాన వితరణ ఈవారంతో విజయవంతంగా 84వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు నిరుపేదలకు, ప్రయాణికులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. పవన్ కళ్యాణ్ సేవా దృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని పేదలకు తమ వంతు సాయం అందిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రముఖ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ, డాక్టర్ నక్క ప్రసాద్, మహర్షి రెడ్డి, రమేష్ బాబు, లక్ష్మణ్, నవీన్, ముని చంద్ర, రాజా పాల్గొన్నారు. వీరితో పాటు జనసేన వీరమహిళలు పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీకాళహస్తిలో ఘనంగా 84వ వారం డొక్కా సీతమ్మ అన్నదానం