విజయవాడ స్పోర్ట్స్, జూన్ 04 సురేషు పున్నమి ప్రతినిధి సురేష్
జూన్ 6వ తేదీన సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో జిల్లా హాకీ పురుషుల జట్టును ఎంపిక చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా హాకీ సమాఖ్య కార్యదర్శి కె.రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 12 నుంచి 15 వరకు సత్యసాయి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. 01-01-1992 తర్వాత పుట్టిన వారు మాత్రమే పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 6వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఎన్టీఆర్ జిల్లా హాకీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అబ్దుల్ కరీం కు రిపోర్టు చేయాలన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా భవాని ప్రసాద్, సురేంద్రబాబు, జగదీష్ బాబు వ్యవహరిస్తారన్నారు. మరిన్ని వివరాల కోసం 9550671671 నెంబర్ను సంప్రధించాలన్నారు.


