శ్రీ కాళహస్తి, జూన్ 01, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి పట్టణంలోని పూసలవీధి 18వ వార్డులో సోమవారం ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ఉమేష్, గాలి చలపతి నాయుడు, మిన్నలి రవి, వజ్రం కిషోర్, చాన్ బాషాతో పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో కార్యక్రమం సజావుగా సాగింది.

పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ