Saturday, 30 May 2026
  • Home  
  • అందరం కలిసి చిన్నారి ప్రాణం కాపాడదాం, అనపర్తి MLA నల్లమిల్లి.
- తూర్పు గోదావరి

అందరం కలిసి చిన్నారి ప్రాణం కాపాడదాం, అనపర్తి MLA నల్లమిల్లి.

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి  ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు. అనపర్తి, 28 మే (పున్నమి ప్రతినిధి): 6 నెలల బాబు ప్రాణాంతక వ్యాధితో పోరాటం, అనపర్తి మండలం పొలమూరు NTR కాలనీకి చెందిన గుడాల ధనరాజ్ కుమారుడు సిద్దాత్ వీరన్ కి ‘బిలియరీ అట్రేసియా” అనే కాలేయ వ్యాధి, బాబు ప్రాణం కాపాడాలంటే లివర్ ప్లాంటేషన్ తప్పనిసరి, రూ 35 లక్షలు వైద్యానికి అవసరం. ముఖ్యమంత్రి సహయనిధి నుండి రూ 8 లక్షలు మంజూరు చేయించిన MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రూ 1 లక్ష సొంత నగదు సహాయం చేసిన MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మిగతా సొమ్ము సహాయం చేయవలసిందిగా దాతలకు విజ్ఞప్తి, ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రకటనకు స్పందించిన పొలమూరు సొసైటీ అధ్యక్షులు సత్తి సత్యనారాయణరెడ్డి ₹10,000, టిడిపి నాయకులు కొవ్వూరి వెంకటరెడ్డి (స్టీల్ కొట్టు శ్రీను) ₹25,000 అందచేయడం జరిగింది. ఈరోజు రామవరంలో పొలమూరుకి చెందిన గుడాల ధనరాజ్ కుమారుడు సిద్దాత్ వీరన్ వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ 8 లక్షల చెక్కుని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి. అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ… పొలమూరు NTR కాలనీకి చెందిన 6 నెలల అబ్బాయి సిద్దాత్ వీరన్ కి లివర్ డిజాస్టర్ రావడం జరిగింది. తల్లిదండ్రులు అనేకమంది వైద్యులను సంప్రదించగా అందరూ లివర్ మార్పిడి తప్పనిసరి అని నిర్దారించడం జరిగింది. చివరకు హైదరాబాద్ PACE హాస్పిటల్ లో కాలేయమార్పిడి చేయడానికి సంకల్పించడం జరిగింది. దీనికి రూ 35 లక్షలు ఖర్చుకానుంది, కాలేయ మార్పిడికి రూ 22 లక్షలు అనంతరం మెడికేషన్ కి రూ 13 లక్షలు అవసరం కానుంది. పేదకుటుంబం అయినప్పటికీ బాబు ప్రాణం కాపాడుకునేందుకు వారు ఈ వైద్యానికి సిద్దపడ్డారు. తల్లి లివర్ ఇవ్వడానికి ఫిట్ కాకపోవడంతో అమ్మమ్మ లివర్ ఇవ్వనున్నారు. శనివారం గానీ సోమవారం గానీ శస్త్రచికిత్స చేయనున్నారు. వారు నా దగ్గరకు రావడం వారికి సియం రిలీప్ ఫండ్ నుండి రూ 8 లక్షలు చెక్ అందజేయడం జరిగింది. పేద కుటుంబానికి చెందిన పిల్లవాడి ప్రాణం నిలిపేందుకు సహాయం చేయమని అందరినీ కోరుతున్నాను. నేను వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయిలు ఆర్దిక సహాయం ఈ కుటుంబానికి అందజేస్తున్నాను. టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో బాటు ఈప్రాంత పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంద సంస్ధలు, దేవాలయాలకు విరివిగా విరాళాలు ఇస్తున్న అందరినీ నేను కోరతా ఉన్నాను ఈ కుటుంబాన్ని ఆదుకోండి. నేను కూడా వైద్యుల ద్వారా క్రౌడ్ ఫండింగ్ కోసం హైదరాబాద్ లో ప్రయత్నం చేస్తా ఉన్నాను. మానవతా దృక్పదంతో అందరూ ముందుకు వచ్చి ఈ బాబు ప్రాణాలు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాని తెలియజేసారు.

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి 

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు.

అనపర్తి, 28 మే (పున్నమి ప్రతినిధి): 6 నెలల బాబు ప్రాణాంతక వ్యాధితో పోరాటం, అనపర్తి మండలం పొలమూరు NTR కాలనీకి చెందిన గుడాల ధనరాజ్ కుమారుడు సిద్దాత్ వీరన్ కి ‘బిలియరీ అట్రేసియా” అనే కాలేయ వ్యాధి, బాబు ప్రాణం కాపాడాలంటే లివర్ ప్లాంటేషన్ తప్పనిసరి, రూ 35 లక్షలు వైద్యానికి అవసరం.

ముఖ్యమంత్రి సహయనిధి నుండి రూ 8 లక్షలు మంజూరు చేయించిన MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రూ 1 లక్ష సొంత నగదు సహాయం చేసిన MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

మిగతా సొమ్ము సహాయం చేయవలసిందిగా దాతలకు విజ్ఞప్తి, ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రకటనకు స్పందించిన పొలమూరు సొసైటీ అధ్యక్షులు సత్తి సత్యనారాయణరెడ్డి ₹10,000, టిడిపి నాయకులు కొవ్వూరి వెంకటరెడ్డి (స్టీల్ కొట్టు శ్రీను) ₹25,000 అందచేయడం జరిగింది.

ఈరోజు రామవరంలో పొలమూరుకి చెందిన గుడాల ధనరాజ్ కుమారుడు సిద్దాత్ వీరన్ వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ 8 లక్షల చెక్కుని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి.

అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ…
పొలమూరు NTR కాలనీకి చెందిన 6 నెలల అబ్బాయి సిద్దాత్ వీరన్ కి లివర్ డిజాస్టర్ రావడం జరిగింది. తల్లిదండ్రులు అనేకమంది వైద్యులను సంప్రదించగా అందరూ లివర్ మార్పిడి తప్పనిసరి అని నిర్దారించడం జరిగింది. చివరకు హైదరాబాద్ PACE హాస్పిటల్ లో కాలేయమార్పిడి చేయడానికి సంకల్పించడం జరిగింది. దీనికి రూ 35 లక్షలు ఖర్చుకానుంది, కాలేయ మార్పిడికి రూ 22 లక్షలు అనంతరం మెడికేషన్ కి రూ 13 లక్షలు అవసరం కానుంది.
పేదకుటుంబం అయినప్పటికీ బాబు ప్రాణం కాపాడుకునేందుకు వారు ఈ వైద్యానికి సిద్దపడ్డారు. తల్లి లివర్ ఇవ్వడానికి ఫిట్ కాకపోవడంతో అమ్మమ్మ లివర్ ఇవ్వనున్నారు. శనివారం గానీ సోమవారం గానీ శస్త్రచికిత్స చేయనున్నారు.
వారు నా దగ్గరకు రావడం వారికి సియం రిలీప్ ఫండ్ నుండి రూ 8 లక్షలు చెక్ అందజేయడం జరిగింది. పేద కుటుంబానికి చెందిన పిల్లవాడి ప్రాణం నిలిపేందుకు సహాయం చేయమని అందరినీ కోరుతున్నాను. నేను వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయిలు ఆర్దిక సహాయం ఈ కుటుంబానికి అందజేస్తున్నాను.
టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో బాటు ఈప్రాంత పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంద సంస్ధలు, దేవాలయాలకు విరివిగా విరాళాలు ఇస్తున్న అందరినీ నేను కోరతా ఉన్నాను ఈ కుటుంబాన్ని ఆదుకోండి. నేను కూడా వైద్యుల ద్వారా క్రౌడ్ ఫండింగ్ కోసం హైదరాబాద్ లో ప్రయత్నం చేస్తా ఉన్నాను. మానవతా దృక్పదంతో అందరూ ముందుకు వచ్చి ఈ బాబు ప్రాణాలు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాని తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.