నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జంపని కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో దగదర్తి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన, సాధారణ బదిలీల్లో భాగంగా ఆత్మకూరుకు నియమితులయ్యారు. స్టేషన్కు చేరుకున్న జంపని కుమార్కు పోలీస్ సిబ్బంది ఆత్మీయ స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతానన్నారు. ప్రజల సహకారంతో సమర్థవంతమైన పోలీసింగ్ అందిస్తానని ఎస్సై జంపని కుమార్ పేర్కొన్నారు.

ఆత్మకూరు నూతన ఎస్సైగా జంపని కుమార్ బాధ్యతల స్వీకరణ