నాగర్ కర్నూలు జిల్లాలో బక్రీద్ పండుగను మతసామరస్యంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మున్సిపల్ నిబంధనల ప్రకారమే ఖుర్బానీ నిర్వహించాలన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామని, విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈద్గాలు, మసీదుల వద్ద గట్టి బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. అనుమానితుల సమాచారాన్ని డయల్ 100కు తెలపాలన్నారు. ఈ సమావేశంలో సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ పాల్గొన్నారు


