Monday, 25 May 2026
  • Home  
  • తాగునీటి కష్టాలకు ఎండ్ కార్డ్.. గిరిజన కాలనీకి జనసైనికుల భరోసా
- తిరుపతి

తాగునీటి కష్టాలకు ఎండ్ కార్డ్.. గిరిజన కాలనీకి జనసైనికుల భరోసా

శ్రీ కాళహస్తి, మే 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండల పరిధిలోని తుఫాన్ సెంటర్ గిరిజన కాలనీలో నెలకొన్న తాగునీటి సరఫరా సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని జనసేన పార్టీ నాయకులు పేట బ్రదర్స్ హామీ ఇచ్చారు. కాలనీవాసులు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకున్న జనసేన నాయకులు సోమవారం అక్కడ పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ.. దాదాపు 200 కుటుంబాలు నివసిస్తున్న ఈ గిరిజన కాలనీలో చాలా రోజులుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇక్కడ శాశ్వత తాగునీటి నిల్వ ట్యాంకును ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జనసేన నాయకులు స్పందిస్తూ.. ఈ సమస్యను స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా కాలనీలో శాశ్వత నీటి ట్యాంకు మంజూరయ్యేలా కృషి చేసి, గిరిజనుల దశాబ్దాల నీటి కష్టాలను తీరుస్తామని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన కార్యకర్తలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.