Sunday, 24 May 2026
  • Home  
  • మర్రిమందలో మెగా ఉచిత వైద్య శిబిరం గ్రామీణులకు వైద్య పరీక్షలు.. హెల్త్ కార్డుల పంపిణీ
- తిరుపతి

మర్రిమందలో మెగా ఉచిత వైద్య శిబిరం గ్రామీణులకు వైద్య పరీక్షలు.. హెల్త్ కార్డుల పంపిణీ

ఏర్పేడు, మే 24, (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని మర్రిమంద సచివాలయం వద్ద నిర్వహించిన శ్రీ బాలాజీ మెగా ఉచిత మెడికల్ క్యాంప్‌ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. బొజ్జల బృందమ్మతో పాటు ఏర్పేడు మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు, ఎగ్జిక్యూటివ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గంట శరత్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు హెల్త్ కార్డులు అందజేశారు. ఈ వైద్య శిబిరంలో శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వైద్యుల బృందం గ్రామీణులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసింది. క్యాంప్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కృష్ణకాంత్, వైద్యులు నవ్య, వంశీ నేతృత్వంలోని బృందం రోగులకు వైద్య సేవలు అందించింది. గ్రామంలో పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, ఆరోగ్య కార్డులు పంపిణీ చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు మునిరెడ్డి, గిరిధర్ రెడ్డి, శిల్పారెడ్డి, అరుణమ్మ, సుబ్రమణ్యం, కేశినేని సుబ్రమణ్యం, మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.