వడ్ల కేంద్రాల వద్ద రైతులు భగభగ మండే ఎండల్లో పడిగాపులు కాస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం తొందరగా కొనాలని తిరుగుతుంటే ఇంతవరకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఒక్క వడ్ల కేంద్రాన్ని కూడా తనిఖీ చేసిన సందర్భాలు లేవని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్ శనివారం ప్రకటనలో ఆరోపించారు. ఇంతవరకు ఎమ్మెల్యే రైతులతో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు.ఎమ్మెల్యే వస్తున్నారంటే సుమారుగా నాలుగు ఐదు చోట్ల మామిడి తోటలు శుభ్రం చేసి మేకలతో దావతులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల కోసం వస్తున్నాడా లేక దావత్ ల కోసం వస్తున్నాడా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పమన్నారు.


