నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. జైపూర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. నిరసనకారులు బ్యారికేడ్లు ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు నీటి ఫిరంగులు ప్రయోగించారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. పరీక్షలలో పారదర్శకత లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

జైపూర్‌లో కాంగ్రెస్ ఆందోళన