మేడిపల్లి నక్కర్త లో ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు
పున్నమి న్యూస్
19 మే 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యాచారం మండల సీపీఎం పార్టీ మండల కార్యదర్శి అలంపల్లి నరసింహ మాట్లాడుతూ సుందరయ్య జీవితాన్ని నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహానేతగా సుందరయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.
అనంతరం సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు, రైతులు, పేద ప్రజల హక్కుల కోసం సుందరయ్య చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన చూపిన విలువలు, క్రమశిక్షణ, ప్రజాపక్ష ధోరణి మరింత అవసరమని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో సీపీఎం పార్టీ కార్యకర్తలు, రైతు సంఘం నాయకులు, యువజన సంఘ ప్రతినిధులు పాల్గొని సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో ఎర్రజెండాలతో, నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
“సుందరయ్య ఆశయాలే ప్రజా పోరాటాలకు మార్గదర్శకం”
“ప్రజల కోసం జీవించిన మహానేతకు ఎర్ర నివాళులు”





