ఖమ్మం, మే
( పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి )
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్‌కు చెందిన గుంటి రవి యాదవ్‌కు షుగర్ సమస్య కారణంగా వైద్యులు కుడి కాలును తొలగించారు. విషయం తెలుసుకున్న ఖమ్మం రెండో పట్టణ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ సోమవారం ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా రవి యాదవ్ కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ధనియాకుల వెంకట్ నారాయణ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ ఆఫీస్ ఇన్చార్జి శ్రీజర్ల వెంకట్, రూప్ కుమార్, కిన్నెరసాని తదితరులు పాల్గొన్నారు.


