తిమ్మాజిపేట మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఉచిత కుటుంబ సలహా కేంద్రం నిర్వహణపై జెండర్ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. సెర్ప్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ లింగంగౌడ్ మాట్లాడుతూ.. మహిళలపై జరిగే అన్యాయాలపై ప్రతి మంగళ, గురువారాల్లో శ్రీశక్తి భవనంలో ఇద్దరు సభ్యులు ఉండి బాధితుల నుంచి ఉచితంగా కేసులు స్వీకరిస్తారని, గడప వద్దకే సత్వర న్యాయం చేకూరుస్తారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుణ, మండల లీడర్లు అమృత, పోచమ్మ, డీపీఎం చిన్నయ్య, ఏపీఎంలు నిరంజన్, ప్రభాకర్, సీసీలు నాగరాజు, యాదమ్మ, జీఆర్‌సీ సభ్యులు పాల్గొన్నారు



