మండల కేంద్రంలో నిర్వహించిన వారంతపు సమీక్షా సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీఓ వెంకటయ్య, ఏపీఓ మల్లేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేపటి నుండి అన్ని గ్రామాలలో కూలీలను పెద్ద ఎత్తున సమీకరించి, ప్రతి గ్రామంలో కనీసం 100 మంది పనికి వచ్చేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఎఫ్‌ఏలు, మేట్‌లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వంద శాతం ఎన్‌ఎంఎంఎస్ (ఆన్‌లైన్ హాజరు) నమోదు చేయాలన్నారు. అదేవిధంగా అన్ని నర్సరీలలో మొక్కల మొలక శాతం బాగుండేలా చూస్తూ, వెంటనే షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు

తెలకపల్లి: ఉపాధి పనుల్లో లేబర్ మొబిలైజేషన్ పెంచాలి: ఎంపీడీవో