Friday, 15 May 2026
  • Home  
  • బక్రీద్ పండుగ శాంతియుతంగా జరుపుకోవాలి: సీఐ ముత్తులింగం
- ఖమ్మం

బక్రీద్ పండుగ శాంతియుతంగా జరుపుకోవాలి: సీఐ ముత్తులింగం

ఖమ్మం మే పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి రూరల్ వంగ ముత్యాల బంజర్ లో గురు వారం నాడు స్థానిక సత్తుపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తు లింగం ముస్లిం మత పెద్ద లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తు లింగం మాట్లాడుతూ రానున్న బక్రీద్ పండుగను శాంతియుతంగా, మత సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ ముత్తులింగం ముస్లిం మత పెద్దలకు సూచించారు. పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అందరూ సహకరించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు అంతర్-రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా సరైన ధృవీకరణ పత్రాలతో మాత్రమే జంతువులను తరలించాలని సూచించారు. గోవధకు పాల్పడవద్దని, ప్రభుత్వం అనుమతించిన జంతువులను మాత్రమే బలి ఇవ్వాలని స్పష్టం చేశారు. జంతు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పంచాయతి అధికారుల సహకారంతో తొలగించి పరిశుభ్రత పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ఖమ్మం మే
పున్నమి న్యూస్ జిల్లా ప్రతినిధి

ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి రూరల్
వంగ ముత్యాల బంజర్ లో
గురు వారం నాడు స్థానిక సత్తుపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తు లింగం ముస్లిం మత పెద్ద లతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తు లింగం మాట్లాడుతూ
రానున్న బక్రీద్ పండుగను శాంతియుతంగా, మత సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని సీఐ ముత్తులింగం ముస్లిం మత పెద్దలకు సూచించారు.
పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అందరూ సహకరించాలని కోరారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు అంతర్-రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద 24 గంటల నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా సరైన ధృవీకరణ పత్రాలతో మాత్రమే జంతువులను తరలించాలని సూచించారు.
గోవధకు పాల్పడవద్దని, ప్రభుత్వం అనుమతించిన జంతువులను మాత్రమే బలి ఇవ్వాలని స్పష్టం చేశారు. జంతు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పంచాయతి అధికారుల సహకారంతో తొలగించి పరిశుభ్రత పాటించాలని కోరారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.