కట్ల రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా రేణుకా చౌదరి జన్మదిన వేడుకలు
గొల్లపూడి వృద్ధాశ్రమలో అన్నదానం
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
వైరా:
కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి జన్మదిన వేడుకలను వైరాలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైరా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కట్ల రంగారావు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సూతకాని జైపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ తదితరులు కేక్ కట్ చేసి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కట్ల రంగారావు మాట్లాడుతూ.. కేంద్ర మాజీ మంత్రిగా రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కీలక పాత్ర పోషించారని అన్నారు. భగవంతుడి ఆశీస్సులతో ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజా సేవలో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కంభంపాటి శేషగిరి, రేచర్ల నాగేశ్వరరావు, రేచర్ల రాముడు, ధర్నా రాజశేఖర్, గుడిమల్ల రత్తయ్య, పుల్ల రాజు, గుత్తికొండ వీరబాబు, ఎండి అన్వర్ పాషా, యామాల భాస్కర్, బుడికి వెంకన్న, గుత్తికొండ నవీన్, ఎస్.కె. మోషన్, రసూల్, తలారి సతీష్, అరికట్ల వినయ్, దగ్గుపాటి రవి, షేక్ రహీం, బండ్ల కృష్ణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
*గొల్లపూడి వృద్ధాశ్రమంలో అన్నదానం*
రేణుకా చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని వైరా మండలం గొల్లపూడి వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు ఆదేశాల మేరకు మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించి, అనంతరం అన్నదానం చేశారు.


