శ్రీకాళహస్తి, మే 11 (పున్నమి న్యూస్): బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చొరవతో ఎంపేడు గ్రామ పరిధిలోని హరిజనవాడ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న స్మశాన దారి సమస్యకు పరిష్కారం లభించింది. ఇటీవల ఎంపేడు పర్యటన సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి స్మశానానికి వెళ్లేందుకు సరైన మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినతిపత్రం అందజేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆ మేరకు సోమవారం రవీందర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దారికి అడ్డంగా ఉన్న వ్యవసాయ భూముల యజమానులతో చర్చలు జరిపి, స్మశానానికి దారి అవసరాన్ని వివరించారు. రైతులు సానుకూలంగా స్పందించడంతో నూతన మార్గం ఏర్పాటుకు అంగీకారం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడం తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. హరిజనవాడ ప్రజల ఇబ్బందిని అర్థం చేసుకుని భూమి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులకు, సమస్య పరిష్కారానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి సేవ చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

హరిజనవాడ స్మశాన దారి సమస్యకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిష్కారం