ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం నాడు మాతృ దినోత్సవం (మదర్స్ డే) జరుపుకుంటాము. ఈ సంవత్సరం 2026లో మదర్స్ డే మే 10వ తేదీన వచ్చిన విషయం అందరికీ విదితమే. ఆధునిక మదర్స్ డే వేడుకలు అమెరికాకు చెందిన అన్నా జార్విస్ కృషితో ప్రారంభమయ్యాయి. 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మే నెల రెండో ఆదివారాన్ని అధికారికంగా మాతృ దినోత్సవంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో పాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లో మే నెల రెండో ఆదివారము ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మన జీవితంలో అమ్మ పాత్రను, ఆమె చూపే నిస్వార్థమైన ప్రేమను మరియు త్యాగాలను గౌరవించడానికి ఈ రోజును కేటాయించారు. ఈ సందర్భంగా మాతృత్వానికి సమర్పిస్తున్న కవితాక్షరాంజలి
🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏
అమ్మ అనే భావనే దైవసమానత్వం
దేవతలు సేవించే అమృతం మాతృత్వం
అమ్మ పదోచ్చారణే మనసుకి ఎంతో ప్రశాంతం
తల్లి ప్రేమకు విలువ కట్టగలమా ఆద్యంతం
కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు మాతృత్వం
బిడ్డల ఎదుగుదలలో తనపాత్ర వర్ణనాతీతం.
నిస్వార్థమైనది ప్రతిఫలం ఆశించనది
బిడ్డ క్షేమం కోసం ఎన్ని కష్టాలనైనా ఓర్చుకునేది
ఈ సృష్టిలో కనిపించేది వినిపించేది తల్లిప్రేమ మాత్రమే
ప్రతి మనిషికి అమ్మే మొదటి గురువు
మాటల నుండి మంచి నడవడిక వరకు
అన్నీ అందేది తల్లి ద్వారానే బిడ్డకు
మాతృదేవోభవ అని వేదాలు చెబుతున్నాయి
అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం లేదని జీవిత పాఠాలు చెబుతాయి
తల్లి పాలు బిడ్డకు ప్రాణాధారం
రోగనిరోధక శక్తికి మూలాధారం
‘అమ్మ’ అనే పదంలోని ప్రతి అక్షరం
హృదయం నుండి వెలువడే మధురామృతం
తల్లి బిడ్డల బంధం పవిత్రమైన అయస్కాంతత్వం
విశ్వజనీన మాధుర్యం మాతృత్వం
🙏🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🙏

