తాలీం ఏ హునర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దీప వెంకట్
ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన “తాలీం ఏ హునర్” కార్యక్రమం పోస్టర్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీప వెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే అరుదైన విధంగా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముస్లిం సమాజ అభివృద్ధికి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లిం యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడంతో పాటు వాటి ఆదాయాన్ని సమాజ సంక్షేమానికి వినియోగిస్తున్న అబ్దుల్ అజీజ్ పనితీరును ప్రశంసించారు. ఆయన నేతృత్వంలో వక్ఫ్ బోర్డులో మరిన్ని సంస్కరణలు చోటుచేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాలీం ఏ హునర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దీప వెంకట్
తాలీం ఏ హునర్ పోస్టర్‌ను ఆవిష్కరించిన దీప వెంకట్ ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన “తాలీం ఏ హునర్” కార్యక్రమం పోస్టర్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీప వెంకట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే అరుదైన విధంగా ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముస్లిం సమాజ అభివృద్ధికి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ముస్లిం యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడంతో పాటు వాటి ఆదాయాన్ని సమాజ సంక్షేమానికి వినియోగిస్తున్న అబ్దుల్ అజీజ్ పనితీరును ప్రశంసించారు. ఆయన నేతృత్వంలో వక్ఫ్ బోర్డులో మరిన్ని సంస్కరణలు చోటుచేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

