ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 27 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు ఖాళీ కావడంతో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను తరలించేందుకు, పశువులకు గడ్డి తీసుకురావడానికి ట్రాక్టర్లకు డీజిల్ లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలిపి డీజిల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆటో డ్రైవర్లు జీవనోపాధి గురించి ఆందోళన చెందుతున్నారు. మినరల్ వాటర్ సరఫరా వాహనాలు నిలిచిపోవడంతో గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారింది.

మనుబోలులో డీజిల్ కొరతతో నిలిచిపోయిన జీవనం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 27 (మల్లికార్జునరావు పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు ఖాళీ కావడంతో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను తరలించేందుకు, పశువులకు గడ్డి తీసుకురావడానికి ట్రాక్టర్లకు డీజిల్ లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలిపి డీజిల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆటో డ్రైవర్లు జీవనోపాధి గురించి ఆందోళన చెందుతున్నారు. మినరల్ వాటర్ సరఫరా వాహనాలు నిలిచిపోవడంతో గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారింది.

