Friday, 8 May 2026
  • Home  
  • రామచంద్రాపురం మండలంలో రూ.1.20 కోట్లతో 48 జల సంరక్షణ పనులు*
- తిరుపతి

రామచంద్రాపురం మండలంలో రూ.1.20 కోట్లతో 48 జల సంరక్షణ పనులు*

నీటి సంరక్షణ పనులతో మండలంలోని 3262 ఎకరాలకు సాగునీటి లబ్ధి జలధార–జలహారతితో రైతులకు రెట్టింపు ప్రయోజనం* పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం ఎండలతో ఎండిపోయిన నేలపై వర్షపు చినుకులు పడితే ఎలా జీవం మేల్కొంటుందో… ఇప్పుడు జల ధార–జల హారతి పనులతో తిరుపతి జిల్లా గ్రామాల్లో అదే దృశ్యం కనిపిస్తోంది. పూడికతీతతో మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్న కాలువలు, నిండుకుండలా మారే చెరువులు, పెరుగుతున్న భూగర్భ జలాలు రైతు జీవితాల్లో కొత్త ఆశల విత్తనాలు నాటుతున్నాయి. ప్రతి నీటి బొట్టును భవిష్యత్‌కు భద్రపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పనులు గ్రామీణ ప్రాంతాలకు సాగునీరు, ఉపాధి, ఆనందాన్ని ఒకేసారి అందిస్తున్నాయి. రామచంద్రాపురం మండలంలో జల ధార – జల హారతి కార్యక్రమం క్రింద 1 కోటి 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 48 పనులకు పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 39 ఫీడర్ కాలువల పునరుద్ధరణ, 4 చెక్ డ్యాం లలో పూడికతీత పనులు, 4 కందిత కందకాల నిర్మాణం ఒక నీటి కుంటలో పూడికతీత పనులు చేపట్టనున్నారు. ఈ పనుల ద్వారా మండలంలోని 3262 ఎకరాలకు లబ్ది కలగనుంది. రామచంద్రాపురం మండలంలోని కొత్తవేపకుప్పం గ్రామ పంచాయితీలో 60 మంది ఉపాధి హామీ వేతన దారులతో 1400 మీటర్ల పొడవు, 5.0 మీటర్ల వెడల్పు గల బుగ్గల కోన కాలువ పూడికతీత పనులను రూ. 5,87,519/- అంచనా విలువతో చేపడుతున్నారు. అటవీ ప్రాంతంలో కురిసే వర్షపు నీరు ఈ కాలువద్వారా రాయలచెరువుకు వెళ్తుంది. ఈ కాలువ పనులు చేపట్టడం ద్వారా కొత్త వేపకుప్పం పంచాయితీతో పాటు నెత్తకుప్పం, పుల్లమనాయుడు కండ్రిగ ప్రాంతాలలోని రైతుల భూములకు సాగు నీరు అందనుంది. తద్వారా ఈ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న వేరుశనగ, మామిడి చెరుకు, వరి పంటలకు నీరు సమృద్ధిగా చేకూరుతుంది. *చెరువు పరిధిలో 400 ఎకరాలకు సాగునీరు, 18 బోర్లు, 8 బావుల్లో భూగర్భ జలాల పెరుగుదల* *సుబ్రహ్మణ్యం రెడ్డి, కొత్తవేపకుప్పం ఉపాధి హామీ వేతనదారుడు* మాట్లాడుతూ జల ధార- జల హారతి పథకం క్రింద తమ గ్రామంలో బుగ్గలకోన కాలువ పనులను చేస్తున్నామన్నారు. విద్యాసాగర్ భూమి నుండి పురుషోత్తం భూమి వరకు ఈ కాలువ పని కొనసాగి రాయలచెరువులోకి ఈ నీరు చేరుతుందన్నారు. ఈ చెరువు క్రింద 400 ఎకరాల భూములకు సాగు నీరు, 18 బోర్లు, 8 బావులలో భూగర్భ జలాలు పెరిగి వ్యసాయానికి మేలు కలుగుతుందన్నారు. ఈ పని చేపట్టడం వలన రైతులందరికీ మేలు జరగడంతో పాటు నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉంటుందన్నారు. ఈ పథకం ద్వారా తమకు ఉపాధి కల్పించే పనులు కల్పిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. *వేసవిలో వలసలు తగ్గించి గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం* *యశోద, కొత్తవేపకుప్పం ఉపాధి హామీ వేతనదారురాలు* మాట్లాడుతూ ఈ కాలువ పనులు చేపట్టడం ద్వారా రైతుల బోర్లు, బావులలో నీటి మట్టాలు పెరిగి వ్యవసాయం చేసుకునేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా పశువులు, గొర్రెలు, మేకలు లాంటి జీవాలకు త్రాగు నీటి కొరత కూడా తీరుతుందన్నారు. ఈ పని ద్వారా తమకు రోజుకు రూ.307/- వరకు వేతనం లభిస్తోందని ఆమె తెలిపారు. వేసవి కాలంలో బయట ప్రాంతాలకు వలస వెళ్ళకుండా ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించినందుకు ప్రధాన మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపింది. వర్షపు నీటి ప్రతి చుక్కను భూమి ఒడిలో దాచే జల ధార – జల హారతి పనులు గ్రామీణ జీవితాలకు కొత్త ఆశలను నింపుతున్నాయి. పూడికతీతతో మళ్లీ పరవళ్లు తొక్కే కాలువలు, నిండుకుండలా మారే చెరువులు రైతు పొలాలకు జీవధారగా మారుతున్నాయి. ఉపాధితో గ్రామాలకు చిరునవ్వులు చేకూరుతుండగా, పెరుగుతున్న భూగర్భ జలాలు భవిష్యత్ తరాలకు భరోసానిస్తున్నాయి.

నీటి సంరక్షణ పనులతో మండలంలోని 3262 ఎకరాలకు సాగునీటి లబ్ధి
జలధార–జలహారతితో రైతులకు రెట్టింపు ప్రయోజనం*

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం

ఎండలతో ఎండిపోయిన నేలపై వర్షపు చినుకులు పడితే ఎలా జీవం మేల్కొంటుందో… ఇప్పుడు జల ధార–జల హారతి పనులతో తిరుపతి జిల్లా గ్రామాల్లో అదే దృశ్యం కనిపిస్తోంది. పూడికతీతతో మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్న కాలువలు, నిండుకుండలా మారే చెరువులు, పెరుగుతున్న భూగర్భ జలాలు రైతు జీవితాల్లో కొత్త ఆశల విత్తనాలు నాటుతున్నాయి. ప్రతి నీటి బొట్టును భవిష్యత్‌కు భద్రపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పనులు గ్రామీణ ప్రాంతాలకు సాగునీరు, ఉపాధి, ఆనందాన్ని ఒకేసారి అందిస్తున్నాయి.

రామచంద్రాపురం మండలంలో జల ధార – జల హారతి కార్యక్రమం క్రింద 1 కోటి 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 48 పనులకు పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 39 ఫీడర్ కాలువల పునరుద్ధరణ, 4 చెక్ డ్యాం లలో పూడికతీత పనులు, 4 కందిత కందకాల నిర్మాణం ఒక నీటి కుంటలో పూడికతీత పనులు చేపట్టనున్నారు. ఈ పనుల ద్వారా మండలంలోని 3262 ఎకరాలకు లబ్ది కలగనుంది. రామచంద్రాపురం మండలంలోని కొత్తవేపకుప్పం గ్రామ పంచాయితీలో 60 మంది ఉపాధి హామీ వేతన దారులతో 1400 మీటర్ల పొడవు, 5.0 మీటర్ల వెడల్పు గల బుగ్గల కోన కాలువ పూడికతీత పనులను రూ. 5,87,519/- అంచనా విలువతో చేపడుతున్నారు. అటవీ ప్రాంతంలో కురిసే వర్షపు నీరు ఈ కాలువద్వారా రాయలచెరువుకు వెళ్తుంది. ఈ కాలువ పనులు చేపట్టడం ద్వారా కొత్త వేపకుప్పం పంచాయితీతో పాటు నెత్తకుప్పం, పుల్లమనాయుడు కండ్రిగ ప్రాంతాలలోని రైతుల భూములకు సాగు నీరు అందనుంది. తద్వారా ఈ ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్న వేరుశనగ, మామిడి చెరుకు, వరి పంటలకు నీరు సమృద్ధిగా చేకూరుతుంది.

*చెరువు పరిధిలో 400 ఎకరాలకు సాగునీరు, 18 బోర్లు, 8 బావుల్లో భూగర్భ జలాల పెరుగుదల*

*సుబ్రహ్మణ్యం రెడ్డి, కొత్తవేపకుప్పం ఉపాధి హామీ వేతనదారుడు* మాట్లాడుతూ జల ధార- జల హారతి పథకం క్రింద తమ గ్రామంలో బుగ్గలకోన కాలువ పనులను చేస్తున్నామన్నారు. విద్యాసాగర్ భూమి నుండి పురుషోత్తం భూమి వరకు ఈ కాలువ పని కొనసాగి రాయలచెరువులోకి ఈ నీరు చేరుతుందన్నారు. ఈ చెరువు క్రింద 400 ఎకరాల భూములకు సాగు నీరు, 18 బోర్లు, 8 బావులలో భూగర్భ జలాలు పెరిగి వ్యసాయానికి మేలు కలుగుతుందన్నారు. ఈ పని చేపట్టడం వలన రైతులందరికీ మేలు జరగడంతో పాటు నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉంటుందన్నారు. ఈ పథకం ద్వారా తమకు ఉపాధి కల్పించే పనులు కల్పిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు.

*వేసవిలో వలసలు తగ్గించి గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం*

*యశోద, కొత్తవేపకుప్పం ఉపాధి హామీ వేతనదారురాలు* మాట్లాడుతూ ఈ కాలువ పనులు చేపట్టడం ద్వారా రైతుల బోర్లు, బావులలో నీటి మట్టాలు పెరిగి వ్యవసాయం చేసుకునేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా పశువులు, గొర్రెలు, మేకలు లాంటి జీవాలకు త్రాగు నీటి కొరత కూడా తీరుతుందన్నారు. ఈ పని ద్వారా తమకు రోజుకు రూ.307/- వరకు వేతనం లభిస్తోందని ఆమె తెలిపారు. వేసవి కాలంలో బయట ప్రాంతాలకు వలస వెళ్ళకుండా ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించినందుకు ప్రధాన మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపింది. వర్షపు నీటి ప్రతి చుక్కను భూమి ఒడిలో దాచే జల ధార – జల హారతి పనులు గ్రామీణ జీవితాలకు కొత్త ఆశలను నింపుతున్నాయి. పూడికతీతతో మళ్లీ పరవళ్లు తొక్కే కాలువలు, నిండుకుండలా మారే చెరువులు రైతు పొలాలకు జీవధారగా మారుతున్నాయి. ఉపాధితో గ్రామాలకు చిరునవ్వులు చేకూరుతుండగా, పెరుగుతున్న భూగర్భ జలాలు భవిష్యత్ తరాలకు భరోసానిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.