తలకొండపల్లి మండలంలో అనిశాకు పట్టుబడ్డ పట్టు గ్రామపంచాయతీ కార్యదర్శి – రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో అధికారి !
పున్నమి న్యూస్ ప్రతినిధి
మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
తలకొండపల్లి మండలంలో అవినీతి బహిర్గతమైంది. మండలంలో ఏజైల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు శరత్ ఫంక్షన్ హాల్ పరిసరాల్లో పట్టుకున్నారు. పర్మిషన్ కోసం వచ్చిన ఒక వ్యక్తి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనతో మండలంలో సంచలనం నెలకొంది. సాధారణ ప్రజల పనులకు అనుమతులు ఇవ్వడానికి కూడా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో పన్నిన ఉచ్చులో కార్యదర్శి చిక్కడం గమనార్హం.
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే అవినీతికి పాల్పడటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



