Saturday, 2 May 2026
  • Home  
  • టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా సుబ్బయ్య బాధ్యతల స్వీకారం… పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
- తిరుపతి

టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా సుబ్బయ్య బాధ్యతల స్వీకారం… పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ

శ్రీకాళహస్తి, మే 02 (పున్నమి న్యూస్): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులుగా ఎం. సుబ్బయ్య బుధవారం విజయవాడ–మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచనలతో ఆయన ఈ పదవిని చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ….ఏప్రిల్ 29 తన జీవితంలో మరపురాని రోజని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆశీస్సులతో ఈ అవకాశం దక్కిందని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తానని, అవసరమైతే ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధమని భావోద్వేగంగా చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో తోడ్పడిన కూటమి నాయకులు, బాల్య మిత్రులు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ అనంతరం నిర్వహించిన జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణా కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.