శ్రీకాళహస్తి, మే 01 (పున్నమి న్యూస్): పట్టణంలోని గోపాలవనం కోర్టు సమీపంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల సమావేశ భవనం శుక్రవారం ఎర్రజెండాల రెపరెపలతో మేడే వేడుకల సందడితో కళకళలాడింది. 140వ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మిక ఉద్యమానికి ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ నాయకులు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం “కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి” అనే నినాదాలతో పరిసర ప్రాంతం మారుమోగింది. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన కేక్‌ను కట్ చేసి కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాన్, కె. హరినాథ్, ఇ. వెంకటేశ్వర్లు, కొండమ్మ, ఎం. శారద తదితరులు మాట్లాడుతూ, సమాజ ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అపారమని కొనియాడారు. వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సీఐటీయూ ఎల్లప్పుడూ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. వేడుకల్లో పారిశుద్ధ్య కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మేడే ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

శ్రీకాళహస్తిలో ఘనంగా మేడే వేడుకలు – కార్మికుల ఐక్యతకు నినాదాలు