కేతనబోయిన వివాహ వేడుకలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొనం
వింజమూరు పట్టణంలోని ఎస్వీ కళ్యాణ మండపంలో కేతనబోయిన కుటుంబానికి చెందిన వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. కేతనబోయిన వెంకటేశ్వర్లు – తిరుపతమ్మ దంపతుల కుమారుడు మణీంద్ర, శకుంతలతో పవిత్ర వివాహ బంధంలో ఏకమయ్యారు. ఈ వేడుకకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం కలిసి జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, గ్రామస్థులు భారీగా పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం సంతోష వాతావరణంలో ముగిసింది.



