తెలంగాణ టెట్ పరీక్షలకు సంబంధించి మరో మూడు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgttet.aptonline.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 ఫీజు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఒక పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950గా ఫీజు ఉంది. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలను జూలై 28 నుంచి 31 మధ్య విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలని సూచించారు.

మరో మూడు రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు