Monday, 27 April 2026
  • Home  
  • చిట్వేల్ మండలంలో విద్యుత్ శాఖ ఏఈపై అవినీతి ఆరోపణలు
- అన్నమయ్య

చిట్వేల్ మండలంలో విద్యుత్ శాఖ ఏఈపై అవినీతి ఆరోపణలు

చిట్వేల్ మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) చలపతిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయని స్థానిక రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో వ్యవసాయానికి సంబంధించిన సింగిల్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు సమయంలో కాంట్రాక్టర్ల ద్వారా రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ముడుపులు వసూలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వీస్ నంబర్లు కేటాయించని వ్యవసాయ కనెక్షన్లకు కూడా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇలాంటి అనధికారిక ట్రాన్స్‌ఫార్మర్లకు ఇప్పటికీ విద్యుత్ శాఖ నుంచి సరైన సర్వీసులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు కుసగుసలాడుతున్నారు.మండల ఏఈ చలపతి విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మద్యం సేవిస్తూ విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లకు ఫ్యూజులు వేయించేందుకు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రైతుల నుంచి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రైతులు నేరుగా ఏఈకి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు అంటున్నారు. ఇటీవల విద్యుత్ ప్రమాదంలో ఈడిగపల్లికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూడా శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఆర్డీఎస్‌ఎస్ (RDSS) పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్లలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. తనకు నచ్చిన వ్యక్తుల ద్వారా పనులు చేయిస్తూ, అవసరం లేని ప్రాంతాల్లో కూడా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

చిట్వేల్ మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) చలపతిపై అవినీతి ఆరోపణలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయని స్థానిక రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో వ్యవసాయానికి సంబంధించిన సింగిల్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు సమయంలో కాంట్రాక్టర్ల ద్వారా రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ముడుపులు వసూలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వీస్ నంబర్లు కేటాయించని వ్యవసాయ కనెక్షన్లకు కూడా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఇలాంటి అనధికారిక ట్రాన్స్‌ఫార్మర్లకు ఇప్పటికీ విద్యుత్ శాఖ నుంచి సరైన సర్వీసులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు కుసగుసలాడుతున్నారు.మండల ఏఈ చలపతి విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మద్యం సేవిస్తూ విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లకు ఫ్యూజులు వేయించేందుకు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రైతుల నుంచి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై రైతులు నేరుగా ఏఈకి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు అంటున్నారు. ఇటీవల విద్యుత్ ప్రమాదంలో ఈడిగపల్లికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కూడా శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం గ్రామాల్లో ఆర్డీఎస్‌ఎస్ (RDSS) పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్లలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. తనకు నచ్చిన వ్యక్తుల ద్వారా పనులు చేయిస్తూ, అవసరం లేని ప్రాంతాల్లో కూడా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.